Skip to main content
Scripbox Logo

బడిలో భావితర విద్యార్థులకు తప్పక నేర్పించాల్సిన కొన్ని విషయాలు

స్కూల్‌లో చదువుకునే సమయంలో, మనకి వ్యావహారిక జీవనంలో ఉపయోగపడే ఫైనాన్స్ పాఠాలను ఎందుకు నేర్పలేదా అని సందేహం వస్తుండేది. అవే గనుక తెలిసి ఉంటే, జీవితంలో కొన్ని పెద్ద పొరపాట్లు చేయకుండా నాకు సహాయపడి నన్ను ఇంకా మంచి పొజిషన్లో ఉంచేవి ఏమో!

స్కూల్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, హిస్టరీ అని చదువుకునేటప్పుడు వీటిని చదవడం వల్ల ఇవి మనకి ఎందుకు పనికొస్తాయి అని ఆలోచించని విద్యార్థి ప్రపంచంలో ఎక్కడా ఉండడు. నిజమే, మనలో 80 శాతం మంది చేసే ఉద్యోగాల్లో వీటి వాడకం చాలా తక్కువే. నేనైతే ఆ పాఠాలు చదివి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోగలిగాను కానీ వాటి ఉపయోగమైతే పెద్దగా ఏం లేదు. కనీసం బడిలో చదువుకున్న హిందీ, ఇంగ్లీష్ అయినా మనకి మన భాష తెలీయని వారితో సంభాషించడానికి కొద్దో గొప్పో సహాయం చేస్తాయి. 

నిజంగా చెప్పాలంటే స్కూల్‌లో చదువుకునే సమయంలో, మనకి వ్యావహారిక జీవనంలో ఉపయోగపడే ఫైనాన్స్ పాఠాలను ఎందుకు నేర్పలేదా అని సందేహం వస్తుండేది. అవే గనుక తెలిసి ఉంటే, జీవితంలో కొన్ని పెద్ద పొరపాట్లు చేయకుండా నాకు సహాయపడి నన్ను ఇంకా మంచి పొజిషన్లో ఉంచేవి ఏమో!

అందుకే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను, చూడండి!

1. ద్రవ్యోల్బణం నుంచి ఎవరూ తప్పించుకోలేరు

మీరు గమనించారో లేదో, మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు లేకపోయినా, మన ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. మన దేశంలో ద్రవ్యోల్బణం ఏడాదికి 8% పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుసా? ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 4% నుంచి 5% ఉంది. అంటే మరొక 10 ఏళ్లలో మన ఖర్చులు 50% పెరుగుతాయి అని దీని అర్ధం. మరి దీనిని బట్టి మరొక 10 ఏళ్లలో మీరు ఎంత సంపాదిస్తుండాలో లెక్కేసుకోండి మరి.

ద్రవ్యోల్బణం
4%6%
8
ప్రస్తుత ఖర్చులు
100100
100
పదేళ్లలో ఖర్చులు
148179
216

2 పొదుపు చేయడం vs పెట్టుబడులు పెట్టడం

మీ సంపాదనలో కొంతభాగం పొదుపు చేయడం మంచిది. కానీ ఈ డబ్బుని ఫిక్సడ్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంక్ ఆకౌంట్, లేదా ఇన్సూరెన్సు లాంటి వాటిలో పెట్టడం వల్ల భవిష్యత్తులో పెరగనున్న ఖర్చుల నుంచి అంటే ద్రవ్యోల్బణం  నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. అందుకే ద్రవ్యోల్బణం ప్రభావం పడని వాటిలో డబ్బు పెట్టడం మంచిపని. ఉదాహరణకి అదే డబ్బుతో భూమి కొంటే ఎంత లాభమో ఆలోచించండి!

3. ఓర్పు, సహనం ఉన్నవారే పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు

మీరు గమనించారో లేదో, కొంతమంది పెట్టుబడి పెట్టి, కొంత లాభం పొందిన వెంటనే ఊరంతా చాటింపు వేసేస్తారు, కానీ అదే వాళ్ళకి నష్టం వస్తే మాత్రం ఎవరికీ  ఒక్క మాట కూడా చెప్పరు. కాబట్టి ఎవరైనా నేను పలానా చోట పెట్టుబడి పెట్టడం వల్ల నాకు ఇంత వచ్చింది అనగానే మీరు కూడా తొందరపడి పెట్టుబడి పెట్టడం లాంటిది చేయకండి. పెట్టుబడి పెడితే ఆ డబ్బు వృద్ధి కావడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి ఓర్పుతో ఎదురుచూడడం తెలిసి ఉండాలి. లాభం  వచ్చింది  కదా అని జాగ్రత్తగా లేకపోతే  తర్వాత నష్టపోవాల్సి వస్తుంది.

4. దేశ అభివృద్ధిలో పాలు పంచుకోండి

దేశంలో ఉన్న టాప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మనం దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు! టాప్ కంపెనీలు అని ఎందుకు అంటున్నాను అంటే, దేశం ఎంతగా అభివృద్ధి చెందితే ఇవి కూడా అంతగా లాభాల బాటలో నడుస్తాయి. కాబట్టి ఈ కంపెనీల మీద ద్రవ్యోల్బణం ప్రభావం అంతగా పడదు.

5. మ్యూచ్యువల్ ఫండ్స్

మ్యూచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి పొదుపు చేసే వాళ్ళు ఇండియాలో చాలా తక్కువ, చెప్పాలంటే చాలా మందికి అసలు అలా పొదుపు చేయొచ్చని తెలీదు కూడా, కానీ అభివృద్ధి చెందిన దేశాలలో అలా కాదు, డబ్బుని దాచి దాచి మరీ మ్యూచ్యువల్ ఫండ్స్ లో పెడుతుంటారు. ఇండియాలో ఉన్న టాప్ కంపెనీలలో మ్యూచ్యువల్ ఫండ్స్ ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు, అందుకే ఇకపై మన దేశం అభువృద్దికొలది పెట్టుబడు దారులు మరింతగా మ్యూచ్యువల్ ఫండ్స్ మీద ఇష్టం చూపిస్తారు. 

6. మీ టాక్సుల విషయంలో జాగ్రత్తగా ఉండండి

మీరు ఎంత సంపాదిస్తే మీపై ఇన్కమ్ టాక్స్ భారం అంతగా పడుతుంటుంది. కానీ, మీ సంపాదన పెట్టుబడి నుంచి వస్తుంటే మాత్రం, మీ ఆస్తి పెరిగేకొలది, మీరు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభం మీద మాత్రమే టాక్స్ పడుతుంది. అంతేకాదు, దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి వచ్చే సంపాదన మీద టాక్స్ అంతకంటే తక్కువ. అందుకే మీ ఇన్వెస్ట్ చేసే ముందు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే టాక్స్ బెడద నుంచి కాస్త తప్పించుకోవచ్చు. మీ ఆర్థిక ఎదుగుదలలో ఇది చాలా ముఖ్యం!

మన పిల్లలకు కూడా స్కూల్‌లో మిగతా సబ్జెక్టులతో పాటు ఇలాంటి విషయాలను కూడా నేర్పిస్తే మంచిది. వాళ్ళు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత డబ్బుని వృధాగా పోనివ్వకుండా ఇవి ఎంతగానో సహాయపడతాయి.

Our Most Popular Categories

Achieve all your financial goals with Scripbox. Start Now