Skip to main content
Scripbox Logo

మీ 20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్ల వయసులో ఎమర్జెన్సీ ఫండ్స్ ఎందుకు అవసరం?

పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్స్ అవసరం కొత్తగా ఉద్యోగాలు ప్రారంభించేవారికి లేదా యౌవన వయసులో ఉన్నవారికే అవసరం అనే అభిప్రాయంతో కొంతమంది ఉంటారు.

ఎమర్జెన్సీ ఫండ్స్  గురించి  మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఎప్పుడైనా అనుకోకుండా మీకున్న సంపాదనని కోల్పోయినప్పుడు కనీసం ఆరు నెలలైనా సంపాదన లేకుండా బ్రతకగలగాలి. అది ఈ ఎమర్జెన్సీ ఫండ్ వల్ల వీలవుతుంది. 

కొంతమంది ఎమర్జెన్సీ ఫండ్ అనేది కేవలం కొత్తగా ఉద్యోగాన్ని ప్రారంభించే వారికి లేదా 20, 30 ఏళ్ల వయసులో ఉన్నవారికే అవసరం ఉంటుందనే ఆలోచనలో ఉంటారు. ఎవరైనా సరే, 40 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు, చాలా మందికి స్థిరమైన ఆదాయం ఉంటుంది కదా. అంతేకాకుండా ఖర్చులను ఏ విధంగా చేయాలో కూడా అనుభవం ఉంటుంది కాబట్టి అనుభవం  ఉన్నవారికి ఆ అవసరం ఉండదని అనుకోవచ్చు.

ప్రస్తుతం దేశంలో 40 ఏళ్ల వయసులో ఉన్న అనేక మంది భారతీయులు, ముఖ్యంగా మెట్రో నగరాల్లో వారు చాలా పెట్టుబడులు పెడుతున్నారు. చాలామంది లాంగ్ టర్మ్ ప్లానుల  పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి, ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి కావాలనే ఉద్దేశం వాళ్ళకి ఉండడం లేదు. అందుకే ఏమో, మీకు అవసరం అయినప్పుడు ఆలోచించకుండా ఖర్చు చేయగల వీలు ఉందా అని అడిగినప్పుడు చాలామంది లేదనే చెప్తుంటారు.

మీరు జాగ్రత్త తీసుకునే ఉండొచ్చు, కానీ ఎంతవరకు జాగ్రత్త పడ్డారు?

పెట్టుబడులు పెట్టినంత మాత్రాన అవసరానికి డబ్బు ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. మనలో చాలా మందికి జీవితంలో అనిశ్చిత పరిస్థితులు గురించి పెద్దగా పట్టించుకోని ధోరణి ఉంది, ప్రత్యేకించి మనం ఇప్పటివరకు ఎలాంటి ప్రతికూల సంఘటనను అనుభవించకపోతే. చాలా మంది అనుకోకుండా ఏదైనా జరిగితే ఏంటి  అనే ఆలోచన లేకుండానే ఉంటున్నారని చెప్తే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం!

మన పరిస్థితి మీద మనకి నమ్మకం ఉండడం మంచిదే, కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతకైనా మంచిది. ఈ విషయం గుర్తుంచుకోండి!

మీకు 40 ఏళ్ల వయసు ఉండడం అంటే మీకు ఒక కుటుంబం ఉంటుంది, మీపై ఆధారపడేవాళ్ళు కూడా ఉంటారు. మీరు బహుశా ఇంటి లోన్ కూడా చెల్లిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మీ ఖర్చులు మీ 20 లేదా 30 ఏళ్లలో ఉన్నదానికంటే చాలా ఎక్కువ.

మీ ఆదాయం పెరుగుతూ వస్తుంది కాబట్టి పెరుగుతున్న ఖర్చులను మీరు గమనించకపోవచ్చు. మీకు 40 ఏళ్ళ వచ్చాయంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో పెద్ద పొజిషన్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సంపాదన  కూడా ఎక్కువే ఉంటుంది. శాలరీ ఎక్కువ కాబట్టి ఒకవేళ డబ్బు లేకపోతే ఏంటి అని ఆలోచించే సందర్భం పెద్దగా రాకపోవచ్చు.

మీ అధిక ఖర్చులు దేనిని సూచిస్తాయి?

ఆర్థికంగా లేదా ఇతరత్రా విషయాల్లో వారి జీవితం పట్టాలు తప్పడానికి ఎవరూ ఇష్టపడరు. 20, 30 సంవత్సరాలు ఉన్నప్పటికంటే ఖర్చులు ఎక్కువగా ఉండే 40, 50 సంవత్సరాల సమయంలోనే ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా అవసరం.

మీ 20 లేదా 30 లలో జీవితం మీద పెద్దగా అవగాహన ఉండదు, రేపు ఏంటని చాలా మంది ఆలోచించరు. ఉద్యోగం పొతే మరొక 3-4 నెలల్లో ఏదోకటి దొరుకుతుందిలే అనే ధోరణిలోనే చాలా మంది ఉంటారు. కానీ వయసు మీద పడినప్పుడు అలా కాదు. ఆ వయస్సులో ఉద్యోగం పోతే ఇంకొకటి దొరకడానికి చాలా టైమ్ పడుతుంది. అలాగే మీకు ఉండే బాధ్యతలు కూడా పెద్దవే అయి ఉంటాయి.

పెట్టుబడులు, లోనులు లాంటి పెద్ద పెద్ద బాధ్యతలు, ఖర్చులు ఉన్నాయంటే టైముకి వాటిని కట్టగల సత్తా కూడా ఉండాలి. అందుకే ఆర్థికంగా ఎట్టిపరిస్థితిలోనూ డబ్బు లేదనే స్థితిలో పడకూడదు.

మీరు అసలు ఏమి చేయాలి?

మీ పెట్టుబడులలో కనీసం కొంతైనా చేతి డబ్బు (లిక్విడ్ క్యాష్) రూపంలో లేదా బ్యాంక్ సేవింగ్ ఖాతాలో ఉండేలా చూసుకోవడం తెలివైన పని.  ఇది కనీసం మీకు ఆరు నెలల ఖర్చులకు సరిపోవాలి. అలాగే మీ కుటుంబానికి ఇంకా మీ కోసం మీకు ఆరోగ్య బీమా తప్పకుండా ఉండాలి.

మీ ఖర్చులకు అనుగుణంగా మీరు ఈ ఎమర్జెన్సీ ఫండ్ పెంచుకోవడం మంచిది. అంటే సంపాదన ఎంత ఉన్నా, ఖర్చులు ఎంత పెరిగినా, ఎలాంటి పరిస్థితిలోనూ కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే చేతి డబ్బు (లిక్విడ్ క్యాష్) ఉండాలి. ఒకవేళ మీ పరిస్థితి ఎలా ఉండబోతుందని మీకు క్లారిటీ లేకపోతే ఇంకా ఎక్కువ దాయడం మంచిది. మీరు అన్నింటికీ సిద్ధంగా ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా నడుస్తుంది.

Achieve all your financial goals with Scripbox. Start Now