Skip to main content
Scripbox Logo

అనవసరమైన ఖర్చులను అధిగమించడానికి మీకోసం కొన్ని టిప్స్.

చాలామంది వారికి అవసరం లేని వస్తువులను ఖర్చుపై నియంత్రణ లేకుండా తరచుగా కొనుగోలు చేస్తుంటారు దాని కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు.

ఒక ఉదాహరణ చెప్తాను చూడండి, నియతి అనే అమ్మాయి రోజూ ఉదయనే  నిద్ర లేచిన తర్వాత  ఇంటర్నెట్‌లోకి లాగిన్ అవ్వకపోతే  ఉండలేదు. ఎలక్ట్రానిక్స్ ఇంకా ఇతర వస్తువులపై ‘మూడు రోజుల అమ్మకం’ అనే మెసేజ్ ఆమె మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డిజైనర్ వస్తువులు ఆఫర్‌లో ఉన్నాయని తెలిశాక ఆ అవకాశాన్ని వాదులుకోకూడదనే ఆతురతలో వెంటనే కొనేస్తుంది.

రెండు రోజుల తర్వాత ఆమె ఆర్డర్ చేసిన తొమ్మిదవ జత డిజైనర్ బూట్లు పార్సిల్ ఇంటికి వచ్చింది.

అనవసరమైన ఖర్చులు చేసే వారిలో నియతి ఒకరు; వారు వారికి అవసరం లేని వస్తువులను కూడా తరచుగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా వారి ఖర్చుల పై నియంత్రణ ఉండదు. దీంతో వారు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడతారు.

ఏదేమైనప్పటికీ అనవసరమైన ఖర్చులు చేయకుండా ఆర్థికంగా బాగుండడానికి కొన్ని దారులు ఉన్నాయి.

1. సమస్యలను గుర్తించండి

ఎవరైనా అనవసరమైన ఖర్చులు చేస్తుంటే, బహుశా వారు దాదాపుగా ఎటువంటి బడ్జెట్‌ను అనుసరించకపోతూ ఉండవచ్చు.

బడ్జెట్‌ ను ప్రారంభించడానికి సులభమైన మార్గాలలో ఒకటి 50-20-30 రూల్. దీనిని బడ్జెట్‌కు ఉపయోగించడం. మీ ఆదాయంలో 50% జీవన వ్యయాలు, అద్దె, ఆహారం, పచారీ వస్తువులు, యుటిలిటీ బిల్లులు, ఇతర వస్తువుల కోసం కేటాయించండి. పొదుపు, పెట్టుబడి రూపంలో ఆర్థిక లక్ష్యాల వైపు మరో 20%. ఇక మీ ఆదాయంలో 30% వినోదం, ప్రయాణం లాంటి వాటి కోసం.

అనవసరమైన ఖర్చులు చేసేవారు తప్పనిసరిగా ఇంటి అవసరాల మీద దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ఆర్ధిక స్థితిని తిరిగి మామూలు చేసుకోవడానికి ప్రయత్నించాలి.

విందులు విలసలకు పెట్టె డబ్బు మీద ఒక లిమిట్ పెట్టుకోండి.

2. కూలింగ్ పీరియడ్

మీరు ఏవైనా అనవసరమైన కొనుగోళ్లు చేస్తున్నప్పుడు, 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆగండి.  మీరు మాల్‌లో ఉన్నా లేదా ఆకర్షణీయమైన ఫర్నిచర్‌ను చూస్తే, దాన్ని ఒక చోట రాసుకోండి. ఆన్‌లైన్‌లో ఏదైనా ఇంటరెస్టింగ్ గాడ్జెట్‌ను చూసినట్లయితే దాన్ని విష్ లిస్ట్‌లో పెట్టుకోండి. 

మీకు నిజంగా ఏదైనా వస్తువు అవసరమైతే దాన్ని ఒక రోజు తర్వాత మళ్ళీ సందర్శించండి. మీ గత అనుభవాలు మీకు నిజంగా అవసరమా అనే దానిపై మీకు సూచన ఇస్తుంది.  24 గంటలు తక్కువగా ఉంటే, వెయిటింగ్ పీరియడ్‌ను ఒక వారం లేదా ఒక నెల వరకు పొడిగించండి. మంచి విషయాలు విలువైనవైతే ఎల్లప్పుడూ వేచి ఉంటాయి.

3. లిస్టు ప్రకారం షాపింగ్ చేయండ

టూత్‌పేస్ట్, కిరాణా సామాగ్రి కొనడానికి ప్రజలు తరచుగా సూపర్‌మార్కెట్‌ కు వెళుతుంటారు. అయితే బబుల్ గమ్, చాక్లెట్లు ఇంకా అవసరం లేని వంట వస్తువులను కొనుగోలు చేయడంతో షాపింగ్ ముగుస్తుంది. అనవసరమైన కొనుగోళ్లను అరికట్టడానికి ముందే షాపింగ్ లిస్ట్ ను సిద్ధం చేయండి. మాల్స్‌కు తక్కువగా వెళ్ళండి. మీరు ఆన్‌లైన్ దుకాణదారులైతే, ఆఫర్‌లు ఇంకా ప్రచార మెయిల్‌స్ ప్రవాహాన్ని వారి మెయిలింగ్ జాబితా నుండి తొలగించండి.

మీరు ఏవైనా అనవసరమైన కొనుగోళ్లు చేస్తున్నప్పుడు, 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఇవ్వండి. మీరు ఏదైనా మాల్‌స్‌లో ఉంటే, ఆకర్షణీయమైన ఫర్నిచర్‌ను చూస్తే, దాని గురించి ఒక చోట రాసుకోండి. మీరు ఆన్‌లైన్‌లో ఆసక్తికరమైన గాడ్జెట్‌ను చూసినట్లయితే, కోరికల లిస్ట్ లో పెట్టుకోండి.

4. పెట్టుబడులను ఆటోమేట్ చేయాలి

మీ ఆర్దికంగా ఇబ్బంది పడకూడదు అంటే మీరు మీ పెట్టుబడులను ఆటోమేట్ చేయాలి. మీ ఆదాయంలో కనీసం 20 శాతం దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక పెట్టుబడుల వైపు వెళ్ళాలి. ఎస్ఐపి (SIP) ను ప్రారంభించండి, ఇది మీకు జీతం వచ్చే రోజు నుండి కొన్ని రోజుల ముందే మీ బ్యాంక్ ఖాతాను డెబిట్ చేస్తుంది. అప్పుడు  మీరు రెటైర్ అయినా, లేదా పిల్లల స్కూల్ ఖర్చులకు ఇబ్బంది రాకుండా ఉంటుంది.

చెప్పాలంటే అనవసమైన ఖర్చు చేసేవారు ఈ క్రింది వాటిని చేయడం ద్వారా వారి ఆర్ధికంగా కుదుటపడవచ్చు. ఇంకా భవిష్యత్తు కోసం ఆదా చేయవచ్చు: సాధారణ బడ్జెట్ విధానం ద్వారా ఇబ్బందికర విషయాలను గుర్తించడం, ఖర్చు మీద లిమిట్ పెట్టడం, షాపింగ్ లిస్ట్‌ను ముందే సిద్ధం చేసుకోవడం, అనవసరమైన కొనుగళ్లను అరికట్టడానికి వెయిటింగ్ పీరియడ్‌ను ఉంచడం ద్వారా చేయవచ్చు. అంతేకాకుండా, పెట్టుబడులను ఆటోమేట్ చేస్తే తర్వాత కంగారు పడాల్సిన పని ఉండదు.

Achieve all your financial goals with Scripbox. Start Now